మద్యం ధరల పెంపు, శ్లాబ్ సిస్టమ్ అమలు - బ్రాండ్లు..బీర్ల కొత్త ధరలు..!!

మందు బాబులకు బిగ్ షాక్. మద్యం ధరల పెంపు ఖాయమైంది. లిక్కర్ తో పాటుగా బీర్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం దాదాపు సిద్దమైంది. ఇందు కోసం శ్లాబ్ సిస్టమ్ అమలు చేయాలనే తాజా ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడనుంది. కొత్త ధరల అమలు వచ్చే వారం నుంచి అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. అధికారిక ప్రకటన దిశగా తుది కసరత్తు జరుగుతోంది. దీంతో.. ఒక బ్రాండెడ్ మద్యం ధరలు పెరగటం ఖాయమని తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరల పెంపుకు తుది కసరత్తు చేస్తోంది. మద్యం ధరల పెంపు దిశ గా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఇప్పటికే వీటి పైన ప్రభుత్వం నియమించిన ధరల నిర్ధారణ కమిటీ సమీక్ష చేసింది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నివేదిక లో పేర్కొన్న అంశాల మేరకు ధరల పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. అందులో భాగంగా బ్రాండెడ్ మద్యం.. బీర్ల ధరల పెంపు ఖాయమని తెలుస్తోంది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో గాజు తయారీకి అవసరమైన ఎల్పీజీ కొరత ఏర్పడిందని, ఎక్కువ ధరకు కొనాల్సి వస్తున్నదని, ఉత్పత్తి వ్యయం పెరిగినందున కనీసంగా 15 శాతం పెంచాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిస్టిల్లరీలు, బ్రూవరీలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి.

శ్రీవారి భక్తులకు బిగ్ రిలీఫ్, అలిపిరి వద్ద అందుబాటులోకి కొత్తగా- ఇక ఆ అవసరం లేదు..!!
శ్రీవారి భక్తులకు బిగ్ రిలీఫ్, అలిపిరి వద్ద అందుబాటులోకి కొత్తగా- ఇక ఆ అవసరం లేదు..!!
telangana-government-likely-to-raise-liquor-prices-by-10-15-from-june-as-latest-proposals

బీర్లు.. బ్రాండెడ్ ధరల పెంపుకు రంగం సిద్దం

ఇక, ప్రభుత్వం ధరల ఖరారు కోసం నియమించిన రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ధరల పెంపు పై తాజాగా ప్రభుత్వానికి సానుకూల నివేదిక ఇచ్చింది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. మొత్తమ్మీద ఈ నెలాఖరుకు ధరలు పెరగటం ఖాయమని తెలుస్తోంది. కాగా.. సాధారణ బ్రాండ్లపై ఫుల్ బాటిలు కనీసంగా రూ.60 పెరిగే అవకాశం ఉంది. ప్రీమియం బ్రాండ్లకు రూ.100, హై-ఎండ్ బ్రాండ్లకు రూ.120 లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నది. మద్యం ప్రియుల నుంచి వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం ఏకపక్షంగా పెంపు నిర్ణయం తీసుకోకూడదని డిసైడ్ అయింది. దీనికి బదులు ధరల సవరణ (క్రమబద్ధీకరణ) పేరుతో సైజు, బ్రాండ్ కేటగిరీ ఆధారంగా 'శ్లాబ్ సిస్టమ్' పద్ధతిలో ధరలు పెంచే యోచనలో ఉన్నది. ధరల పెంపుతో ప్రభుత్వానికి నెలకు సుమారు రూ.150 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరు తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. గతేడాది మే నెలలో క్వార్టర్‌కు రూ.10 చొప్పున స్వల్పంగా ధరలు పెరిగాయి. ఇప్పుడు పెద్ద మొత్తంలోనే ధరలు పెంచేందుకు రంగం సిద్దం అవుతోంది. దీని పైన ఈ వారంలోనే నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+