గాలితో వైయస్ సంబంధాలు: విహెచ్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: బిజెపి నాయకుడు గాలి జనార్దన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి మధ్య గల సంబంధాలపై కర్ణాటక కాంగ్రెసు నాయకులు పార్టీ అధిష్ఠానవర్గానికి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డికి మధ్య గల సంబంధాలపై తాను అధిష్ఠానవర్గానికి ఫిర్యాదు చేయలేదని, ధరంసింగ్ వంటి కర్ణాటక నేతలు పిర్యాదు చేశారని ఆయన అన్నారు. ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో ఆయన సోమవారంనాడు మాట్లాడారు.

గాలి జనార్దన్ రెడ్డి 25 సీట్లను ప్రభావితం చేశారని, డబ్బును గుప్పించారని, బిజెపికి డబ్బులు పెట్టారని ఆయన అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారాన్ని చూస్తుంటే పేదవాళ్లు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి వచ్చినట్లేనని ఆయన అన్నారు. అది చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యలపై తాను మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+