వరంగల్ లో యువకుడి దారుణ హత్య
వరంగల్: వరంగల్ పట్టణంలో భరత్ అనే యువకుడిని రౌడీలు హత్య చేశారు. కరీమాబాద్ కు చెందిన భరత్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి దేశాయి పేట్ లో మద్యం సేవించారు. ఆ తర్వాత వారి మధ్య గొడవ మొదలైంది. భరత్ తో గొడవ పడిన వారు కొందరు రౌడీలతో బాటు వచ్చి భరత్ పై దాడి చేశారు. భరత్ ను పక్కనే ఉన్న శ్మశాన వాటికకు తరలించి, తల నరికి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications