తెలంగాణపై త్వరలో నిర్ణయం: దేవేందర్
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, ఇప్పటికే జాప్యం జరిగిందని తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ చెప్పారు. ఈ నెల 18వ తేదీన జరిగే పార్టీ కమిటీ సమావేశంలో తెలంగాణ ప్రజల మనోభావాలను బలంగా వినిపిస్తానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసుకు అన్ని సీట్లు రావడం తనకు ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు.
ఉప ఎన్నికల్లో తమకు మరో రెండు సీట్లు వస్తాయని ఊహించామని, అయితే మొత్తం మీద ఊహించిన మేరకు తమకు సీట్లు వచ్చాయని ఆయన అన్నారు. కాంగ్రెసుకు అన్ని సీట్లు వస్తాయని ఊహించలేదని ఆయన అన్నారు. తెలంగాణ ద్రోహం చేస్తున్న కాంగ్రెసుకు అన్ని సీట్లు రావడం ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు. గత యాభై ఏళ్లలో జరగని మోసం తెలంగాణకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిందని ఆయన విమర్శించారు. 610 జీవోను భూస్థాపితం చేశారని, తెలంగాణ భూములను అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు












Click it and Unblock the Notifications
