పాత ధరకే గ్యాస్: ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: వంటగ్యాస్ ను పాత ధరకే అందిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, చమురు కంపెనీలకు మధ్య ఒప్పందం కుదిరిందని, దీంతో సబ్సిడీతో గ్యాస్ అందించడానికి ఏ విధమైన ఇబ్బందులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెంచిన వంటగ్యాస్ సిలిండర్ 50 రూపాయల ధరను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఇటీవల ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
పెట్రోలియం శాఖా మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన వంటగ్యాస్ ధరలు సోమవారం నుంచే అమలులోకి వచ్చాయి. ఇంతకు ముందు చెల్లించిన అదనపు 50 రూపాయలను వచ్చే బుకింగులో తగ్గించుకోవాలని కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వులో ఆదేశించింది.












Click it and Unblock the Notifications
