ఉభయ కమ్యూనిస్టుల భేటీ
హైదరాబాద్: రాష్ట్రంలోని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు సోమవారం సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. తిరిగి ఈ నెల 14వ తేదీన సమావేశం కానున్నట్లు ఆ పార్టీల నాయకులు సమావేశానంతరం తెలిపారు. ప్రజా ఉద్యమాలపై ఐక్య పోరాటాలను ఉధృతం చేయాలని వామపక్షాల నాయకులు నిర్ణయించుకున్నారు. ఉప ఎన్నికల్లో తాము పరస్పరం సహకరించుకున్నామని, అందువల్ల తమ మధ్య విభేదాలున్నాయన్న మాటలో నిజం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు చెప్పారు. పోటీ చేయని చోట్ల ఎవరు ఎవరికి మద్దతిచ్చారనే సమస్య లేదు కాబట్టి సమస్య రాలేదని ఆయన అన్నారు.
ప్రజా సంఘాల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ప్రజా ఉద్యమాలకు రూపకల్పన చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ చెప్పారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తూ, చేర్యాల, ముషీరాబాద్ స్థానాల్లో సిపిఎం ఆ పార్టీ మద్దతు తీసుకుంది. సిపిఐ రెండు స్థానాల్లో పెటీ చేసింది. అయితే తాను పోటీ చేయని చోట్ల ఎవరికీ మద్దతివ్వలేదు.












Click it and Unblock the Notifications
