చిరంజీవి వమ్ము చేయరు: నాగబాబు
హైదరాబాద్: మెగాస్టార్ రాజకీయాలకు ప్రవాస భారతీయులు మద్దతు ప్రకటించారు. న్యూజెర్సీలో జరిగిన ప్రవాస వారధి కార్యక్రమంలో వారు ఈ మద్దతు ప్రకటించారు. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని ఆయన సోదరుడు నాగబాబు సూచనప్రాయంగా చెప్పారు. ఐదు లక్షల మంది ఎన్నారైల మద్దతు చిరంజీవికి ఉందని ఆ ప్రవాస వారధి కార్యక్రమంలో వక్తలు చెప్పారు. ఎన్నారైలతో నాగబాబు టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
చిరువంటి వారు రాజకీయాల్లోకి రావాలని, చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే తమ పూర్తి మద్దతు ఉంటుందని ఎన్నారైలు చెప్పారు. ఎన్నారైల నమ్మకాన్ని చిరంజీవి వమ్ము చేయబోరని నాగబాబు టెలీకాన్ఫరెన్స్ లో అన్నారు. చిరంజీవి రాజకీయ పార్టీ ఆదర్శాలు, సిద్ధాంతాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 1500 మంది ఎన్నారైలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
