హైదరాబాద్ : ఉపఎన్నికల్లో తెలంగాణవాదం ఓడిపోలేదని తెరాస పార్టీనే ఓటమిపాలయిందని తెరాస(ఎన్) అధినేత ఆలె నరేంద్ర విమర్శించారు. ఉపఎన్నికల తర్వాత కూడా కేసీఆర్‌లో మార్పు రాలేదని ఆయన దుయ్యబట్టారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెరాస(ఎన్) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అందర్నీ కలుపుకుని ముందుకు సాగాలని నిర్ణయించినట్టు చెప్పారు. తదుపరి ఎన్నికల సమయానికి పరిస్థితుల మేరకు బీజేపీతో పొత్తు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.