కొరియోగ్రాఫర్ సూర్యతేజ ప్రత్యక్షం
హైదరాబాద్: కిడ్నాప్ నకు గురైనట్లు చెబుతున్న కొరియోగ్రాఫర్ సూర్యతేజ సోమవారం ఉదయం అకస్మాత్తు ఒక టీవీ చానెళ్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యాడు. గత 35 రోజులుగా సూర్యతేజ కనిపించకుండా పోయాడు. సూర్యతేజ అదృశ్యంపై ఈ నెల 8వ తేదీన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్యతేజను టీవీ యాంకర్ డింపుల్ కిడ్నాప్ చేసినట్లు వారు ఆరోపించారు.
తాను కిడ్నాప్ నకు గురి కాలేదని, తల్లిదండ్రుల నుంచి పారిపోయి శ్రీశైలం చేరుకున్నానని సూర్యతేజ చెప్పాడు. సూర్యతేజకు తాను గతంలో ఆశ్రయం ఇచ్చిన మాట నిజమేనని డింపుల్ అంటోంది. డింపుల్ సూర్యతేజను కిడ్నాప్ చేశారనే ఆరోపణలు వచ్చిన తర్వాత ఆదివారంనాడే అతని ఆడియో టేపు ఒకటి విడుదలైంది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని సూర్యతేజ చెప్పాడు.












Click it and Unblock the Notifications
