ప్రమాదాల్లో 13 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. మెదక్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. పండరీపురం సందర్శించుకుని వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న క్వాలిస్ వాహనం నర్సాపూర్ - సంగారెడ్డి రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. డ్రైవర్ తో సహా ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లనే ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఒంటిమిట్ట, తాండ్రపాడు జాతీయ రహదారి సమీపంలో జి. పుల్లారెడ్డి కళాశాల వద్ద సోమవారం ఉదయం లారీ, జీపు ఢీకొట్టుకోవడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు. గాయపడినవారిని తిరుపతి ఆస్పత్రికి తరలించారు. జీపు ప్రయాణికులు తిరుపతి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణకుంట వద్ద సోమావరం ఉదయం వంతెనపై నుండి కారు వాగులో పడడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఒకరు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిది.












Click it and Unblock the Notifications
