తెలంగాణవాదమే గెలిచింది: విహెచ్
విశాఖపట్నం: ఉప ఎన్నికల్లో తెలంగాణవాదమే గెలిచిందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. తెలంగాణ సెంటిమెంటు ఓటు చీలిందని, అందుకే ఈ విధమైన ఫలితాలు వచ్చాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు మాటలకు, చేతలకు మధ్య పొంతన లేదని, అందుకే తెరాసకు తగిన ఫలితాలు సాధించలేదని ఆయన అన్నారు.
ప్రతిసారీ కెసిఆర్ కు ఓటేస్తున్నామని, తెలంగాణ తేవడం లేదు, గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును తిడుతున్నాడు అని కెసిఆర్ పై వ్యతిరేకత నెలకొని ఉందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి తెలివిగా వ్యవహరించారని, తెలంగాణ సెంటిమెంట్ ఉంది, తాను తెలంగాణకు వ్యతిరేకం కాదు, తెలంగాణపై తమ పార్టీ నేత సోనియా నిర్ణయం తీసుకుంటారు అని ముఖ్యమంత్రి ప్రజలకు నచ్చజెప్పారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
