అమీర్ పేట స్టేట్ హోంకు సూర్యతేజ
హైదరాబాద్: కిడ్నాప్ వివాదంలో చిక్కుకున్న కొరియోగ్రాఫర్ సూర్యతేజను పోలీసులు హైదరాబాదులోని అమీర్ పేటలో గల స్టేట్ హోంకు తరలించారు. మైనారిటీ తీరకపోవడంతో అతన్ని స్టేట్ హోంకు పంపించారు. సూర్యతేజను టీవీ యాంకర్ డింపుల్ కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సూర్యతేజ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. దాదాపు 35 రోజుల పాటు కనిపించకుండా పోయిన సూర్యతేజ అకస్మాత్తుగా ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యాడు.
పోలీసులు డింపుల్ ను, సూర్యతేజను అదుపులోకి తీసుకుని విచారించారు. సూర్యతేజ పాఠశాల రికార్డులను పరిశీలించి మైనారిటీ తీరలేదని నిర్ధారించుకున్నారు. దీంతో సూర్యతేజను తల్లిదండ్రులకు అప్పగించడానికి పోలీసులు సిద్ధపడ్డారు. అయితే సూర్యతేజ తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి నిరాకరించాడు. అంతకు ముందు తల్లిదండ్రులపై అతను తీవ్ర ఆరోపణలు కూడా చేశాడు.












Click it and Unblock the Notifications
