చిరు పార్టీపై వైయస్ పరోక్ష వ్యాఖ్య

ఈ ఏడాది నుంచి గ్రామం యూనిటుగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో నాయకుల కన్నా కార్యకర్తలే బాగా పని చేశారని, నాయకులకు నమ్మకం లేకుండా పోయిందని ఆయన అన్నారు. కార్యకర్తలే బాగా పని చేశారని ఆయన కొనియాడారు. వ్యవసాయాన్ని పండుగలా భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో విశ్వసనీయతను నిరూపించుకున్నామని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో తాను తెలుగుదేశం పార్టీని గానీ తెలంగాణ రాష్ట్ర సమితిని గానీ తిట్టలేదని, ప్రభుత్వం చేసిన పనులనే వివరించానని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసికెళ్లాలని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సూచించారు. కార్యకర్తలను పట్టించుకోకపోతే ఎన్ని అభివృద్ధి పథకాలను చేపట్టినా లాభం లేదని పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
