రాజమండ్రి : ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్ లు)కు వ్యతిరేకంగా తాము ఉద్యమం చేపడతామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ పథకాల పేరుతో జరుగుతున్న అవినీతిని బయటపెడతామని బాబు చెప్పారు. మీకోసం కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న బాబు కొత్తపేట నియోజకవర్గంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మంలో నిర్వహించే రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో కరెంటు కోతపై ఉద్యమాన్ని ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఈ సమస్యపై కార్యకర్తలు అన్ని చోట్లా నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పన్నులు అధికంగా పెంచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు