ఆమె ఆస్తులు రు. 80 లక్షలపైనే
గుంటూరు: గుంటూరు పౌరసరఫరాల ఆర్.ఐ. సుశీల ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు దాడులు నిర్వహించారు. సుశీల నివాసంలో బుధవారంనాడు వారు సోదాలు నిర్వహించారు. సుశీల 80 లక్షల రూపాయలకు పైగా ఆస్తులు కలిగి ఉన్నట్లు ఎసిబి అధికారులు సోదాల్లో తేల్చారు. ఆమెకు మూడు అపార్టుమెంట్లు, వీటిలో ఒకటి హైదరాబాదులో, రెండు గుంటూరులో ఉన్నట్లు తేలిందని ఎసిబి అధికారులు చెప్పారు. అలాగే పది స్థలాలున్నట్లు తేలిందని, వీటిలో ఏడు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయని వారు చెప్పారు.
కిలోన్నర బంగారం, రెండు కిలోల వెండి బయటపడినట్లు వారు తెలిపారు. ఇంకా జాయింట్ ఖాతాలు ఉన్నాయని, వాటిని పరిశీలించాల్సి ఉందని వారన్నారు. అయితే ఈ ఆస్తులు తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించాయని, తల్లిదండ్రులకు తానొక్కతే కూతురునని సుశీల చెప్పారు. తన భర్త వ్యాపారం చేస్తారని, తన కుమారుడు ఉద్యోగం చేస్తాడని ఆమె చెప్పారు. తాము యేటా ఆదాయం పన్ను రిటర్నులు కూడా సమర్పిస్తున్నామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications
