రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. మరో పది మంది దాకా గాయపడ్డారు. రెండు లారీలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతలగూడెం సమీపంలో రెండు లారీలు ఢీకొట్టుకున్నాయి. మృతులు అదే జిల్లా త్రిపురారం మండలం చెన్నాయపాలెం గ్రామానికి చెందినవారు.
ఏకాదశి కావడంతో నాగార్జునసాగరుకు లారీలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లారీలో ప్రయాణిస్తున్నవారిలో 11 మంది మరణించారు. సంఘటనా స్థలంలో విషాద వాతావరణం చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications
