ఇక కూల్పివేతలపై జిహెచ్ ఎంసి దృష్టి
హైదరాబాద్: బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బిపియస్) కింద అక్రమ కట్టడాల క్రమబద్దీకరణకు తగిన గడువు ఇచ్చిన గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెస్ ఎంసి) ఇక కూల్చివేతలపై దృష్టి సారించనుంది. శుక్రవారం నుంచి కూల్చివేతలపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ వరకు క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు సంస్థ గడువు ఇచ్చింది. నగరంలో అక్రమ కట్టడాలపై సంస్థ నగర ప్రణాళిఖ అధికారులు ఇప్పటికే లెక్కలు తీశారు. గత నెలలో అధికారులు 450 అక్రమ కట్టడాలను కూల్చివేశారు.
మొదటి దశలో అధికారులు పెంట్ హౌస్ లపై, అక్రమ కట్టడాలపై దృష్టి సారిస్తారు. ఆ తర్వాత డీవియేషన్స్, ఇతర నిబంధనల ఉల్లంఘనపై దృష్టి పెడతారు. అనధికార కట్టడాల క్రమబద్దీకరణకు ఇప్పటికే భవన యజమానులకు, బిల్డర్లకు తగిన సమయం ఇచ్చామని, ఇక కూల్చివేతలకు పూనుకుంటామని అధికారులు చెబుతున్నారు. బిపియస్, లే అవుట్ క్రమబద్దీకరణ స్కీంల కింద ఇప్పటి వరకు లక్షా 70 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత రెండు రోజుల్లోనే 30 వేల దాకా దరఖాస్తులు వచ్చాయి. ఎల్ బి నగర్, శేర్ లింగంపల్లి, కూకట్ పల్లి, సర్కిల్ 19 నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సర్కిల్ 10 కింద జూబిలీ హిల్స్, బంజారా హిల్స్, పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్ పేటలు వస్తాయి. డిమాండ్ డ్రాఫ్టులు తీసుకోవడానికి బ్యాంకుల్లో మంగళవారం భారీ క్యూలు కనిపించాయి. దీంతో జిహెచ్ ఎంసి అధికారులు నగదు, చాలెన్లను కూడా అంగీకరించారు. దరఖాస్తులను మంగళవారం రాత్రి పది గంటల వరకు స్వీకరించారు.












Click it and Unblock the Notifications
