పుష్ప అప్పలనాయుడు అరెస్టు
వరంగల్: గోల్డ్ క్వెస్టు మేనేజింగ్ డైరెక్టర్ పుష్ప అప్పలనాయుడును వరంగల్ జిల్లా పోలీసులు గురువారంనాడు చెన్నైలో అరెస్టు చేశారు. ఆమెను అక్కడి నుంచి వరంగల్ కు తీసుకు వస్తున్నారు. రేపు (శుక్రవారం) ఉదయం 4 గంటలకు వారు వరంగల్ కు చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడికి చేరుకున్న వెంటనే ఆమెను కోర్టులో ప్రవేశపెడతారు.
గోల్డ్ క్వెస్టుపై కీసుకొండ పోలీసు స్టేషనులో పలు కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా ఎస్పీ సజ్జనార్ ఆమెను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. గోల్డ్ క్వెస్టు ఆకర్షణీయమైన పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications