కృష్ణా జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య
విజయవాడ: కృష్ణా జిల్లా మోటారు గ్రామ సర్పంచ్ ఇమ్మాడి నరసింహారావు బుధవారం దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఇమ్మాడి నరసింహారావు మంత్రి పిన్నమనేని అనుచరుడు. గత కొంత కాలంగా గ్రామంలో ఒక భూమికి సంబంధించిన తగాదా నడుస్తోంది. ఈ తగాదానే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు.
గతంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కోనేరు రంగారావు గ్రామానికి వచ్చినప్పుడు కూడా గొడవ జరిగింది. నరసింహారావును హత్య చేసిన వ్యక్తులు ఆయన బైకుపైనే పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే హత్యకు పాల్పడిందెవరనేది ఇంకా తేలడం లేదు.












Click it and Unblock the Notifications
