అమ్మవారిని దర్శించుకున్న పవన్
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని అమ్మవారిని మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆదివారంనాడు దర్శించుకున్నారు. పాతబస్తీలోని సింహవాహిని అమ్మవారి శతాబ్ది బోనాలు ఉత్సవాలు ఆదివారంనాడు ప్రారంభమయ్యాయి. ఈ బోనాల ఉత్సవాన్ని హైదరాబాద్ స్థానికులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
అమ్మవారిని నవతెలంగాణ ప్రజాపార్టీ అధ్యక్షుడు టి. దేవేందర్ గౌడ్ కూడా దర్శించుకున్నారు. అలాగే రాష్ట్ర మంత్రి ముఖేష్ గౌడ్, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల ఏర్పాట్లు ఏ మాత్రం బాగా లేవని తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శించారు. అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో బోనాల ఉత్సవాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications
