పేలుళ్లకు వాడినవి కిరాయి సైకిళ్లు
అహ్మదాబాద్: అహ్మదాబాదులో బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు 13 సైకిళ్లను, రెండు కార్లను, ఒక బస్సును వాడినట్లు పోలీసులు గుర్తించారు. పేలుళ్లకు వాడిన సైకిళ్లను కిరాయికి తీసుకున్నట్లు గుర్తించారు. ఒక్కో రోజుకు 80 రూపాయలకు వాటిని కిరాయికి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. జైపూర్ లో పేలుళ్లకు ఉగ్రవాదులు సైకిళ్లను కొనుగోలు చేశారు. కిరాయికి తీసుకోవడానికి గ్యారంటీ ఇచ్చిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కొంత మంది సైకిల్ డీలర్లను పోలీసులు ప్రశ్నించారు. రాయపూర్ లో సైకిళ్లను పార్కు చేసినవారిని చూసినట్లు చెబుతున్నవారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మణినగర్ పేలుళ్లలో గాయపడిన వారిని సివిల్ ఆస్పత్రికి చేర్చడానికి వాడిన మూడు అంబులెన్సులను కారు అనుసరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అనుమానితుల స్కెచ్ లేవీ ఇప్పటి వరకు విడుదల చేయలేదని పోలీసు అధికారి భాటియా చెప్పారు. తమకు లభించిన కారు రిజిస్ట్రేషన్ నెంబరు టూవీలరుదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications