ఎరువుల కోసం టవరెక్కి బెదిరింపు
కరీంనగర్: ఎరువుల కోసం కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం శీలాపూర్ గ్రామం సర్పంచ్ గురవారం ఉదయం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఎరువులపై జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమై హామీ ఇచ్చే వరకు సెల్ టవర్ దిగబోనని హెచ్చరిస్తున్నాడు. సర్పంచ్ కు మద్దతుగా పెద్ద యెత్తున రైతులు అక్కడికి చేరుకున్నారు. వారం నుంచి రేపు, మాపు అంటూ ఎరువుల పంపిణీలో అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే టవర్ దిగుతానని సర్పంచ్ చెబుతున్నాడు. సర్పంచ్ కు మద్దతుగా ప్రభాకర్ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్నవారు అతన్ని అడ్డుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎరువుల కోసం కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఎరువుల కోసం వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో జరిగిన తొక్కిసలాటలో బుధవారం ఉప్పలయ్య అనే రైతు మరణించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
