పొంగిపొర్లుతున్న మున్నేరు వాగు
వరంగల్: వరంగల్ జిల్లా కుండపోత వర్షంతో అతలాకుతలం అవుతోంది. వరంగల్ లోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని మహబూబ్ బాద్, జమాండ్లపల్లి మధ్య మున్నేరు వాగు పొంగి పొర్లుతోంది. భద్రాచలానికి, వరంగల్ కు మధ్య రాకపోకలు ఆగిపోయాయి.
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాదులోనూ వర్షాలు జోరుగానే పడుతున్నాయి. వాతావరణం చల్లగా తయారైంది. రోడ్ల మీద నీరు వచ్చి చేరుతున్నది.












Click it and Unblock the Notifications
