అయేషాను నేనే చంపా: సత్యంబాబు
విజయవాడ: విజయవాడలోని ఒక హాస్టల్ లో ఉంటూ బి - ఫార్మసి విద్యార్థిని అయేషాను హత్య చేసింది తానేనని పిడతల సత్యంబాబు అనే యువకుడు అంగీకరించాడు. పిడతల సత్యంబాబును పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అతను నేరాన్ని అంగీకరించాడు. తాను అయేషాను ఎలా హత్య చేసిందీ వివరించాడు. హత్యాస్థలంలో దొరికిన లేఖ దస్తూరీ సత్యంబాబు చేతిరాతతోబ సరిపోలుతున్నదని, పాదముద్రలు కూడా సరిపోలుతున్నాయని పోలీసులు చెప్పారు. ఈ రెంటి పరీక్ష నిమిత్తం పోలీసులు వాటిని తీసుకుని హైదరాబాద్ బయలుదేరారు. ఇరవై యేళ్ల సత్యంబాబుకు 18 హత్యాయత్నాలు, అత్యాచారాలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. సత్యంబాబు ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. అతన్ని సిఐడి పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
సత్యంబాబు విచారణలో చెప్పిన వివరాల ప్రకారం: అయేషాపై అత్యాచారం చేసిన తర్వాత ఆమెను సత్యంబాబు బండరాయితో మోది చంపాడు. బాత్ రూమ్ పై నుంచి మొదటి అంతస్థులోకి వెళ్లాడు. నిజానికి అతని టార్గెట్ మొదటి అంతస్థులో నిలబడి ఫోన్ మాట్లాడుతున్న అమ్మాయి. కానీ ఇంతలో హాల్లో పడుకున్న అయేషా కనిపించింది. వెంటనే ఆమె వద్దకు చేరుకుని అత్యాచారం చేసి హత్య చేశాడు. అనంతరం ప్రేమచిరుత అని రాసి ఉంచాడు. హత్య చేసిన తర్వాత హాల్లో కూర్చుని లేఖ రాశాడు. బాత్ రూమ్ పై నుంచి దూకి పారిపోయాడు.












Click it and Unblock the Notifications