భవంతులు కూలి పది మంది మృతి
ముంబయి: దక్షిణ ముంబయిలోని రెండు భవనాలు ఒకటి బుధవారంనాడు కూలిపోవడంతో పది మంది మరణించారు. దాదాపు 60 మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది పాఠశాలల విద్యార్థులే ఉన్నారు. భారీ వర్షానికి ఈ భవనాలు కూలిపోయాయి. దాదాపు 30 మంది పిల్లలు గాయపడ్డారు. పాఠశాల భవనం పై అంతస్థు బాల్కనీ కూలి మీద పడడంతో వారు గాయపడ్డారు.
దానికి రెండు గంటల ముందే దక్షిణ ముంబయిలోని బెండి బజార్ లో గల 70 ఏళ్లనాటి భవనం కూలిపోయింది. నాలుగంతస్థుల ఈ రంగోలీ భవనం తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో కూలిపోయింది. నిద్రలోని అందులో నిద్రిస్తున్న వారిని మృత్యువు కబళించింది.












Click it and Unblock the Notifications