హైదరాబాద్ రెండో పెద్ద నగరం
హైదరాబాద్: హైదరాబాద్ దేశంలో రెండో అతి పెద్ద నగరంగా అవతరించింది. హైదరాబాద్ నగరాభివృద్ది సంస్థ ఆదివారం నుంచి హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీగా మారింది. ఇందుకు సంబంధించిన లోగోను ముఖ్యమంత్రి డాక్టర్ వైలయ్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 849 గ్రామాలు ఇందులో విలీనమవుతున్నాయి. ఇందులో 28 శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి.
వచ్చే 20 ఏళ్లలో దేశంలో అతి పెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుందని, ఈ స్థితిలో మౌలిక వసతులు కల్పించడం పెద్ద సవాల్ అని, అధికారులు ఇందుకు సంబంధించిన సవాళ్లను స్వీకరించాలని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాదును ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. నగరానికి రోజుకు 24 గంటలు మంచినీళ్లు సరఫరా చేస్తామని, ఇందుకు కృష్ణా రెండో దశ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications