బలరాం సస్సెన్షన్ పై అసెంబ్లీ స్తంభన
హైదరాబాద్: తమ సభ్యుడు కరణం బలరాంపై విధించిన ఆరు నెలల సస్పెన్షన్ పై బుదవారం శాసనసభలో చర్చకు తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. అయితే అందుకు స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి నిరాకరించారు. తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడకుండా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. రైతు సమస్యలపై మాత్రమే సభలో చర్చకు అనుమతిస్తానని స్పీకర్ పదే పదే చెప్పినా వారు పట్టించుకోలేదు. బలరాం సస్పెన్షన్ పై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు.
కరణం బలరాం సస్పెన్షన్ పై తనకు లేఖ రాస్తే పరిశీలిస్తానని స్పీకర్ తెలుగుదేశం సభ్యులకు సూచించారు. అయినా తెలుగుదేశం సభ్యులు తమ పట్టును వీడకుండా ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా తెలుగుదేశం సభ్యులు తమ డిమాండ్ తో సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. కరణం బలరాం సస్పెన్షన్ పై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications
