నేడు.. తెలంగాణలో అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్

తెలంగాణలోని అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు నేడు బంద్ కానున్నాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ తో నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా కళాశాలలు, విద్యా సంస్థలు యాజమాన్యాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. తెలంగాణ ప్రైవేట్ పీజీ అండ్ డిగ్రీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5వ తేదీ నుంచీ నిరసన కార్యక్రమాలను చేపడుతూ వస్తోన్నాయి. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం, మానవహారాలు, రిలే నిరాహార దీక్షలను చేపట్టడం వంటి నిరసన కార్యక్రమాలను తలపెట్టాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి బంద్ ను ప్రకటించాయి.

Private Degree and PG Colleges Announce Statewide Bandh today Over Fee Reimbursement Dues Telangana

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులను విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందనేది టీపీడీఎంఏ ప్రధాన ఆరోపణ. ప్రజా వాణిలో సైతం పాల్గొని తమ వినతులను ప్రభుత్వానికి అందజేశారు ఈ అసోసియేషన్ ప్రతినిధులు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన స్పందన లేకపోతే.. 8న రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేస్తామనీ ప్రకటించారు. దీనికి అనుగుణంగా నేడు కార్యాచరణలోకి దిగారు. రేపు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో విద్యార్థులతో కలిసి మానవ హారాలను నిర్మించనున్నారు.

త్వరలో తిరుమలలో భక్తులకు అందుబాటులో.. నిర్మాణం తుదిదశలో !!
త్వరలో తిరుమలలో భక్తులకు అందుబాటులో.. నిర్మాణం తుదిదశలో !!

అప్పటికీ నిధుల విడుదలపై హామీ రాకపోతే రహదారుల దిగ్బంధనానికి వెనుకాడబోమని యాజమాన్యాలు హెచ్చరించాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరవధిక రిలే నిరాహార దీక్షలకు దిగుతామని టీపీడీఎంఏ అధ్యక్షుడు బీ సూర్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఫీజు బకాయిలు రాకపోవడంతో ప్రైవేటు కళాశాలలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల నిర్వహణ, ఉద్యోగుల జీతాల చెల్లింపు కూడా కష్టతరంగా మారిందని,విద్యాసంస్థల ఉనికి ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు.

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడం వల్ల ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని సూర్యనారాయణ రెడ్డి చెప్పారు. కాలేజీ భవనాల అద్దెలు, కరెంట్ బిల్లులు, ల్యాబ్ పరికరాల నిర్వహణ వంటి ప్రాథమిక వ్యయాలను కూడా చెల్లింలేక పోతున్నామని, వేతనాలు అందక వేలాది మంది అధ్యాపక కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటోన్నాయని, ఇది నేరుగా విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపుతోందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+