Viral Video: రీల్స్ పిచ్చితో 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్ లోకి.. తర్వాత ఏం జరిగిందంటే..?
సోషల్ మీడియా మోజులో పడిన నేటి యువత రోజురోజుకు బరితెగిస్తున్నారు. రీల్స్, యూట్యూబ్ షాట్స్ అంటూ పిచ్చి పీక్స్ వరకు పోయి లైక్ ల కోసం ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించి ఫీట్స్ చేస్తూ కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు.. రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చని కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా రీల్స్ చేస్తున్నారు. అలా ఫాలోవర్లు, రీల్స్ మోజులో పడి కొందరు నేరాలకు తెరలేపుతుంటే మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల పశ్చిమ్ బెంగాల్ లో రీల్స్ పిచ్చి విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. జల్పాయ్ గురి లాటాగురి- చాల్సా అటవీ మార్గంలో సోషల్ మీడియాలో లైక్ ల కోసం రీల్స్ చేస్తున్నప్పుడు బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన మరవక ముందే ఉత్తర్ ప్రదేశ్ లో మరో షాకింగ్ ఘటన జరిగింది.
Jhansi - A young man suffered fractures in both legs after he jumped from a 30-foot-high dam in Jhansi while trying to shoot a social media reel. The incident took place at Pahuj Dam. Pushpendra Kumar Manauriya, 32, a resident of Parwai village under Raksa police station, had… pic.twitter.com/HpowlS0MO7
— NextMinute News (@nextminutenews7) September 7, 2026
రీల్స్ మోజులో పడి ఓ యువకుడు దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి డ్యామ్ లోకి దూకాడు. ఝాన్సీ జిల్లా రక్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వాయి గ్రామానికి చెందిన పుష్పేంద్ర కుమార్ అనే యువకుడికి సోషల్ మీడియా రీల్స్ చేయడం అలవాటు. అయితే సెప్టెంబర్ 6 ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి సమీపంలోని పహూజ్ డ్యామ్ ను చూసేందుకు వెళ్లాడు. ఇక రీల్స్ అంటే పిచ్చి ఉన్న పుష్పేంద్ర కుమార్ ఇన్ స్టా రీల్ కోసం ఒక స్టంట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా స్నేహితులు వీడియో రికార్డ్ చేస్తుండగా.. పుష్పేంద్ర కుమార్ డ్యామ్ లోని వ్యూ పాయింట్ వద్ద ఉన్న బాండ్రీ వాల్ ఎక్కి దాదాపు 32 అడుగుల ఎత్తు నుంచి డ్యామ్ లోకి దూకేశాడు. అయితే లోతు తక్కువ ఉన్న ప్రాంతంలో దూకడంతో అతని రెండు కాళ్ల ఎముకలు విరిగిపోయాయి.

దాంతో హుటాహుటిన స్నేహితులు పుష్పేంద్రను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు రెండు కాళ్లు విరిగాయి కాబట్టి కొన్ని నెలల పాటు పుష్పేంద్ర బెడ్ కే పరిమితం కానున్నట్లు తెలిపారు. కొన్ని సెకన్ల రీల్, వీడియో కోసం యువకులు తమ ప్రాణాలను పనంగా పెట్టొద్దని పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
