చిరు తొవ్వలో దేవేందర్ పార్టీ?

T Devender Goud
హైదరాబాద్: నవ తెలంగాణ ప్రజాపార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి మధ్య ఒక అవగాహన ఇప్పటికే కుదిరిందా అనే ప్రశ్న ముందుకు వస్తోంది. బుధవారం సాయంత్రం హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో అన్ని రాజకీయ పార్టీలపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన ప్రజారాజ్యంపై మాత్రం సానుకూలంగా ప్రతిస్పందించారు. తెలంగాణపై ప్రజారాజ్యం వ్యవస్థాపక నేత చిరంజీవి చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. చిరంజీవి తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుర్తించడం సంతోషమని ఆయన అన్నారు. దేవేందర్ గౌడ్ చిరంజీవితో పొత్తుకు సిద్ధపడినట్లు మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ది ఆత్మగౌరవ సమస్య, అభివృద్ధి సమస్య అని చిరంజీవి తిరుపతి బహిరంగసభలో అన్నారు. విడిపోవడమే ప్రజాభీష్టమైతే తాను తెలంగాణ ఆవిర్భావానికి సహకరిస్తానని చిరంజీవి చెప్పారు. దీన్ని తెలంగాణకు పూర్తి అనుకూలమైన ప్రకటనగా దేవేందర్ గౌడ్ భావిస్తున్నారు. సామాజిక న్యాయ సాధన ధ్యేయంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా దేవేందర్ నవ తెలంగాణ ప్రజా పార్టీ ఏర్పడింది. అదే లక్ష్యంతో చిరంజీవి ప్రజారాజ్యం రాష్ట్ర స్థాయిలో ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నిర్మాణ, లక్ష్య సాధనలో ఏకీకృత ఉందనే భావన వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై దేవేందర్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు.

నవంబర్ ఒకటవ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే రెండో తేదీన తామే స్వయం పరిపాలనను ప్రకటించుకుంటామని దేవేందర్ గౌడ్ చెప్పారు. ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ పేరున ఉన్న బోర్డులను తొలగిస్తామని, వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చేస్తామని ఆయన చెప్పారు. నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలను బహిష్కరిస్తామని ఆయన చెప్పారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి గ్రామగ్రామన తెలంగాణ ఉద్యమాన్ని చేపడుతామని ఆయన చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన సత్యాగ్రహాలు చేస్తామని ఆయన చెప్పారు. నిజాం కళాశాల మైదానంలో జరిగిన నవ తెలంగాణ రాష్ట్ర పార్టీ బహిరంగ సభకు తెలంగాణ నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. పార్టీ ముసాయిదాను కూడా ఆయన ఈ సభలో విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+