చిరంజీవికి అది ఇష్టం లేదట

అయితే మాటీవీ తన పార్టీ మౌత్ పీస్ గా మారిపోవడం చిరంజీవికి ఇష్టం లేదని చెబుతున్నారు. అంతే కాకుండా ఇతర బోర్డు సభ్యులు కూడా ఉన్నారు. చలసాని రమేష్, మాట్రిక్స్ ల్యాబ్ కు చెందిన ఎన్. ప్రసాద్, సి. రామకృష్ణ, మురళీకృష్ణంరాజు, వెంకటేశ్వర రాజు వంటి బోర్డు సభ్యులున్నారు. వీరిలో అందరికీ చిరంజీవి రాజకీయాలతో ఏకీభావం ఉండకపోవచ్చు. అందువల్ల చిరంజీవిపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం కూడా భావ్యం కాదనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ టీవీ చానెల్ ను మరో సంస్థ కొనుగోలు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వీటిలో ఏది నిజమో కాలమే తేలుస్తుంది.












Click it and Unblock the Notifications
