రెండేళ్ల దాకా పదవులుండవు: డిఎస్

సెప్టెంబర్ 30వ తేదీ లోగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆయన డిసిసి అధ్యక్షులను ఆదేశించారు. సెప్టెంబర్ 15వ తేదీ లోగా మండల కమిటీ అధ్యక్షుల నిమాయకం జరగాల్సి ఉందని ఆయన చెప్పారు. పిసిసి కార్యాలయంలో కంప్యూటర్ సౌకర్యం ఉందని, టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించే సౌకర్యం ఉందని, ఈ సౌకర్యాలను సమర్థంగా వాడుకోవడం అవసరమని ఆయన డిసిసి అధ్యక్షులతో అన్నారు. ఎస్ఎంఎస్ లు పంపడం, స్వీకరించడం అలవాటు చేసుకోవాలని, సమాచార వినిమియానికి ఇది మంచి సాధనమని, తాను అలవాటు చేసుకున్నానని ఆయన చెప్పారు. మాజీ శాసనసభ్యుడు రావుల రవీంద్రనాథ్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications
