గుంటూరు: కోస్తా కారిడార్ వల్ల రైతులకు నష్టం జరగకుండా చూస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి చెప్పారు. కోస్తా కారిడార్ వల్ల వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆమె గురువారం గుంటూరు జిల్లా రేపల్లెలో మీడియా ప్రతినిధులతో అన్నారు. కోస్తా కారిడార్ వల్ల ఆ ప్రాంతం పారిశ్రామికాభివృద్ధి జరిగి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి సమ ప్రాధాన్యం ఇస్తోందని ఆమె చెప్పారు. కోస్తా కారిడార్ వల్ల రైతులకు నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆమె చెప్పారు.