చిరంజీవిపై దాసరి వ్యంగ్య సినిమా
హైదరాబాద్: చిరంజీవిపై విమర్శనాస్త్రాలు సంధించే ఒక రాజకీయ వ్యంగ్య సినిమాను నిర్మించాలని ప్రముఖ దర్శకుడు, కాంగ్రెస్ నాయకుడు దాసరి నారాయణ రావు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా పేరు "మేస్త్రి". చిరంజీవికి, దాసరికి కొంత కాలంగా పడడం లేదన్న విషయం తెలిసిందే.
గతంలో ఎన్టీఆర్ మీద తీసిన రాజకీయ చిత్రాలు "మండలాధీశుడు", "గండికోట రహస్యం" ఆనాడు జనాన్ని బాగా ఆకర్షించాయి. "మేస్త్రి" సినిమాలో శ్రీహరి హీరోగా నటించనున్నాడు. దాసరి ప్రధాన పాత్రలో కన్పిస్తారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే సిద్ధమయ్యాయి. ఇటీవల దాసరి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని కలిసి ఈ సినిమా గురించి చర్చించినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications