ఖైరతాబాద్ గణేశుడికి ఆన్ లైన్ పూజలు
హైదరాబాద్: హైదరాబాదులోని ఖైరతాబాద్ వినాయక విగ్రహానికి ఆన్ లైన్ లో కూడా పూజలు నిర్వహించ్చే అవకాశాన్ని కల్పించారు. ప్రవాస భారతీయ భక్తులను దృష్టిలో పెట్టుకుని ఈ అవకాశాన్ని కల్పించినట్లు గణేష్ ఉత్సవ కమిటీ నాయకులు తెలిపారు. ఖైరతాబాద్ వినాయక విగ్రహానికి ఓ ప్రత్యేక ఉంది. నగరంలో అత్యంత ఎత్తైన విగ్రహం ఇదే. ఈ విగ్రహాన్ని చూడడానికి పెద్ద యెత్తున భక్తులు వస్తుంటారు.
గత 54 ఏళ్లుగా ఖైరతాబాద్ విగ్రహ ప్రతిష్ఠాపన విషయంలో ప్రత్యేకతను ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 47 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజేంద్ర అనే శిల్పి ఈ విగ్రహాన్ని మలిచారు. దీని కోసం చెన్నై నుంచి ప్రత్యేకంగా శిల్పులను రప్పించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠాపనకు, ఉత్సవాలకు పెద్ద యెత్తున ఖర్చు అవుతుంది. దాదాపు 18 నుంచి 20 లక్షల రూపాయలు విరాళాల రూపంలో వస్తాయని ఉత్సవ కమిటీ నాయకులు చెప్పారు.












Click it and Unblock the Notifications