చిరుతో భేటీ శుభాకాంక్షలకే: అమర్ సింగ్
హైదరాబాద్: ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని తాము కలవడంలో రాజకీయ ఎజెండా ఏమీ లేదని సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ చెప్పారు. తాము చిరంజీవితో పొత్తు కోసం చర్చలు జరపడానికి కలుస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, మీడియా తన మాటలను వక్రీకరించిందని ఆయన అన్నారు. చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేయడానికే తాము చిరంజీవిని కలుస్తున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు. బిగ్ బి అమితాబ్ సాన్నిహిత్యం వల్లనే తనకు చిరంజీవి దగ్గరయ్యారని ఆయన చెప్పారు.
జయప్రద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేయబోరని ఆయన స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నుంచే జయప్రద పోటీ చేస్తారని ఆయన చెప్పారు. రాంపూర్ నుంచే ఆమె లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. జయప్రదతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం చిరంజీవిని కలిశారు. అమర్ సింగ్ ఇతర సమాజ్ వాదీ పార్టీ నేతలతో పొత్తులపై చర్చలు జరగవని, వారు చిరంజీవిని మర్యాదపూర్వకంగానే కలుస్తున్నారని ఇంతకు ముందు ప్రజారాజ్యం అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ చెప్పారు. ఈ నేపథ్యంలో అమర్ సింగ్ తన మాట మార్చారు.












Click it and Unblock the Notifications
