నాలుగు బాక్సుల బంగారం దోపిడీ
హైదరాబాద్: హైదరాబాదులోని షంషాబాద్ కార్గో నుంచి బంగారం తెస్తున్న కారును దండగులు అపహరించారు. ఈ కారులో నాలుగు బాక్సుల బంగారం ఉంది. ఈ బంగారం హైదరాబాదులోని ఉస్మాన్ గంజ్ కొరియర్ సర్వీసు సంస్థకు ముంబయి నుంచి మరుధర్ కొరియర్ ద్వారా వచ్చింది. బంగారం విలువ 20 కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. బంగారం తెస్తున్న కారును దుండగులు మారుతీ కారులో అనుసరించారు. బంగారం తెస్తున్న కారు డ్రైవరును దుండగులు తుపాకులతో బెదిరించి కారును తీసుకొని పారిపోయారు.
ఆ కారు నెంబరు 1081 అని చెబుతున్నారు. సంఘటనా స్థలానికి పోలీసు కమీషనరు ప్రసాదరావు చేరుకున్నారు. ఆచూకీ చెప్పిన వారికి 50 వేల రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అర్పిట్ రాజు గ్యాంగు ఈ దోపిడీకి పాల్పడి వుండవచ్చునని అనుమానిస్తున్నారు. 2005లో కూడా ఉస్మాన్ గంజ్ కు చెందిన ఇదే కొరియర్ సంస్థకు చెందిన 37 లక్షల రూపాయల విలువ చేసే బంగారం దొంగతనం జరిగింది.












Click it and Unblock the Notifications
