గ్యాంగ్ మన్ అప్రమత్తత: తప్పిన ప్రమాదం
గుంటూరు: గ్యాంగ్ మన్ అప్రమత్తత వల్ల రైలు ప్రమాదం తప్పింది. రైల్వే లైన్ దెబ్బ తిన్న విషయాన్ని సకాలంలో కనిపెట్టి అధికారులకు సమాచారం అందించడంతో ఈ ప్రమాదం తప్పినట్లు రైల్వై అధికారులు చెప్పారు. విజయవాడ - చెన్నై సెక్షన్ సమీపంలోని స్టూవర్టుపురం స్టేషనులో పనిచేస్తున్న గ్యాంగ్ మన్ పి. శ్రీరాములు శనివారం రాత్రి రైల్వే లైన్ దెబ్బ తిన్న విషయాన్ని గుర్తించి, అధికారులకు తెలియజేశాడు. దీంతో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న హైదరాబాద్ - చెన్నై ఎక్సుప్రెస్ కు ప్రమాదం తప్పింది.
రైలు బాపట్ల స్టేషన్ వద్ద ఆగిపోయింది. తాత్కాలికంగా లైనుకు మరమ్మతు చేసిన తర్వాత రైలు యధావిధిగా సాగిపోయింది. అయితే అయితే లైన్ పై నెమ్మదిగా రైలును నడపాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications
