ఇద్దరూ వస్తాదుల్లా ప్రవర్తించారు: గౌడ్
నిజామాబాద్ : శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడులు వస్తాదుల్లా ప్రవర్తించారని నవతెలంగాణ ప్రజాపార్టీ అధినేత దేవేందర్‌గౌడ్ విమర్శించారు. ఆయన చేస్తున్న తెలంగాణ ఆత్మగౌరవ యాత్ర ఆదివారంనాడు నిజామాబాదుకు చేరుకుంది. రానున్న ఎన్నికల్లో ప్రస్తుత శాసనసభ్యుల్లో 90 శాతంమందికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణసమస్యలకు పరిష్కారమని ఆయనన్నారు. 2009లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
