చిరు విధానాలు తేలాలి: రాఘవులు
న్యూఢిల్లీ: ప్రజారాజ్యం పార్టీ తన విధానాలను ఇంకా స్పష్టం చేయాల్సి ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. మతతత్వం, బిజెపిపై విధానాలను, జాతీయ రాజకీయాల్లో అనుసరించే విధానం చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం స్పష్టం చేయాల్సి ఉందని, ఈ పార్టీ తన విధానాలను స్పష్టం చేసిన తర్వాతనే కలిసి పనిచేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కొత్త పార్టీలు ప్రజారాజ్యం, నవ తెలంగాణ ప్రజా పార్టీల విధానాలను చూసిన తర్వాతనే తాము ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు.
ప్రజాసమస్యలపై కలిసి వచ్చే వారితో కలిసి పని చేస్తామని ఆయన అన్నారు. తగాదా పడాల్సిన వ్యక్తులతో, విధానాలతో తగాదా పడకపోవడం కూడా సరి కాదని ఆయన అన్నారు. ఎన్నికలు ఇప్పుడే లేనందున తాము ఇప్పుడే పొత్తుల గురించి, సర్దుబాట్ల గురించి ఆలోచించడం లేదని ఆయన చెప్పారు. అయినా పొత్తులు, సర్దుబాట్లపై జాతీయ స్థాయిలో నిర్ణయం జరుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
