చిరుపై విహెచ్ తో సోనియా ఆరా
న్యూఢిల్లీ: ప్రజారాజ్యం పార్టీపై, రాష్ట్రంలో చిరంజీవి ప్రభావంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావును అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. హనుమంతరావు బుధవారంనాడు సోనియా గాంధీని కలిశారు. ఎరువుల కోసం ఆందోళన చేసిన రైతులపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయించాలని ఆయన సోనియా గాంధీని కోరారు. ఎరువులు లభించక రైతులు ఉద్వేగంతో గోదాములపై దాడి చేసి ఉండవచ్చునని, ఆందోళనలకు దిగి ఉండవచ్చునని, అటువంటివారిపై ప్రభుత్వం కేసులు నమోదు చేసిందని, వాటిని ఎత్తివేయడం మంచిదని ఆయన సోనియాను కలిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు.
మైనింగ్ యూనివర్శిటీని తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయించాలని కూడా ఆయన సోనియా గాంధీని కోరారు. సోనియాగాంధీ రేపు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగే సదస్సులో ఆమె పాల్గొంటారు. ఇందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ నేపథ్యంలో హనుమంతరావు సోనియాను కలిశారు.












Click it and Unblock the Notifications