స్పీకరును అవమానించారు: డిఎస్

D Srinivas
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి తెలుగుదేశం పార్టీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిని అవమానపరిచిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన తెలుగుదేశం పార్టీ పునరాలోచన చేసి ఉపసంహరించుకుంటుందని భావించానని ఆయన అన్నారు. స్పీకర్ సభను నిబంధనల ప్రకారమే నడుపుతారని అనుకోవాలని, ఆ తర్వాత స్పీకర్ విజ్ఞతకే వదిలేయాలని ఆయన అన్నారు.

ప్రభుత్వంపై ఎన్ని రకాలైనా విమర్శలు చేయవచ్చునని, కానీ స్పీకరుపై విమర్శలు చేయడం సరి కాదని, ప్రజలు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. సురేష్ రెడ్డి హుందాతనం, పద్ధతి తెలిసిన వ్యక్తి అని, మంచివారని ఆయన కొనియాడారు. నిబంధనలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక్క రోజు కూడా సభను పూర్తిగా నడనివ్వలేదని ఆయన అన్నారు. సోమనాధ్ ఛటర్టీ లోకసభ స్పీకరుగా వ్యవహరించిన తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుందని, ఛటర్జీ తీరు వారి పార్టీకి కూడా నచ్చలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+