శ్రీకాకుళం జిల్లాకు వరద ముప్పు
శ్రీకాకుళం: వంశావళి, నాగావళి నదులకు విపరీతంగా నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీకాకుళం జిల్లాలోని పరిసర గ్రామాలను వరద ముంచెత్తుతోంది. నాగావళి నది పరీవాహక ప్రాంతంలోని దాదాపు పది ఎకరాల పంట నీట మునిగింది. నిగమాల, మాతల మధ్య రోడ్డుపై నీరు వచ్చి చేరింది. దీంతో రాకపోకలు ఆగిపోయాయి.
వంశధారకు సిఎన్ పేట మండలంలోని ప్రాంతంలో గండి పడింది. దీంతో వాడవలస గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. నలబుజ్జివలస, ఆముదాల వలస, కొత్తూరు తదితర మండలాల్లోని గ్రామాల్లోకి నీరు వచ్చి చేరింది. గ్రామాల్లోకి నీరు వస్తుండడంతో నవ్వాకులపేట, ఆనందపురం గ్రామాల ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications