నారాయణ ప్రమాదం: 3గురు విద్యార్థుల మృతి?
హైదరాబాద్: హైదరాబాదుకు సమీపంలోని బోడుప్పల్ లో గల నారాయణ కార్పోరేట్ కళాశాల భవనం మూడో అంతస్థు గోడ కుప్పకూలి ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఒక విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు. మరో 20 మంది విద్యార్థులను కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సంభవించిన వెంటనే అంబులెన్సులు వచ్చాయి. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే విద్యార్థినీవిద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలకు వచ్చారు. వారు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
శిథిలాల కింద 40 మంది విద్యార్థుల దాకా చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ భవంతిని నాలుగు నెలల క్రితం కొత్తగా కట్టారు. శిథిలాల కింద ట్యాంకు ఉంది. ఏడు ఆడుగుల దాకా ఉన్న ఈ ట్యాంకులో కూడా విద్యార్థులు పడిపోయారనే ఆ విషయాన్ని పరిశీలిస్తున్నారు. నిర్మాణ లోపంవల్లనే భవనం కూలిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోడ కూలిన వెంటనే విద్యార్థులు బయటకు పరుగులు తీశారు.












Click it and Unblock the Notifications