తెలంగాణపై బాలుడు: చిరు మౌనం
కరీంనగర్: తెలంగాణపై ఓ బాలుడి ప్రశ్నకు శుక్రవారం ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మౌనమే సమాధానమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ సమస్యలు పరిష్కారమవుతాయని విశ్వనాధ్ అనే బాలుడు చిరంజీవితో అన్నాడు. దానికి చిరంజీవి మౌనంగా ఉండిపోయారు. ఆ బాలుడి మాటపై ఆయన స్పందించలేదు.
తెలంగాణకు అనుకూలంగా ప్రజారాజ్యం పార్టీ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి సంఘం కార్యకర్తలు చిరంజీవి వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. చిరంజీవి కాన్వాయ్ కి అడ్డం పడడానికి ప్రయత్నించారు. విద్యార్థి సంఘం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లా చేనేత కార్మికులను పరామర్శించడానికి శుక్రవారం వచ్చినప్పుడు చిరంజీవికి ఈ అనుభవాలు ఎదురయ్యాయి.












Click it and Unblock the Notifications