నలుగురు విద్యార్థుల స్థితి ఆందోళనకరం
హైదరాబాద్: హైదరాబాదులోని బోడుప్పల్ సమీపంలో గల నారాయణ జూనియర్ కళాశాల ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కళాశాల భవంతి మూడో అంతస్థు గోడ కూలడంతో ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించినట్లు ధృవీకరించారు. ఇందులో గాయపడిన 27 మందిని ఎల్బీ నగరులోని కామినేని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ఇదిలా వుంటే, కళాశాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ఇక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. కళాశాల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల వద్ద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications