కాంగ్రెస్ ను మట్టి కరిపిస్తాం: దత్తాత్రేయ
కరీంనగర్: కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ నుంచి ఆయన శనివారం ఆయన పార్టీ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఎన్నికల ఏడాదిలో పార్టీని బలోపేతం చేసేందుకు మహా సంకల్ప యాత్రలకు బిజెపి శ్రీకారం చుట్టింది. తెలంగాణాలో రెండు, రాయలసీమ, కోస్తా ఆంధ్రలో ఒక్కొక్కటి చొప్పున ఈ యాత్రలు జరుగుతాయి. ఇందులో భాగంగా మొదటి యాత్రకు శుక్రవారం ర్యాలీతో శ్రీకారం చుట్టారు.
మహా సంకల్ప యాత్ర రథాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ రథం దత్తాత్రేయ నాయకత్వంలో హైదరాబాద్‌నుంచి వేములవాడ బయలుదేరింది. ఈ యాత్ర 15 రోజులపాటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలను చుట్టివచ్చి వచ్చే నెల 4న ధర్మారంలో ముగుస్తుంది. ప్రత్యేక తెలంగాణా, ఉగ్రవాదం, అధిక ధరలు, ఎరువులు, విత్తనాల కొరత తదితర అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తామని దత్తాత్రేయ తెలిపారు. ఈనెల 25న హైదరాబాద్‌లో జరిగే విజయ సంకల్పయాత్రలో బిజెపి అగ్రనేత అద్వానీపాల్గొంటారని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications