మృతదేహాల తరలింపు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: తుమ్మల విక్రం రెడ్డి మృతదేహాన్ని ఇక్కడికి తరలించేందుకు ఆయన కుటుంబ సభ్యులు 3 లక్షల 23 వేల 325 రూపాయలు ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలో డిపాజిట్ చేశారు. అమెరికాలో హత్యకు గురైన విక్రంరెడ్డి, సౌమ్యారెడ్డి మృతదేహాలు ఆదివారం సాయంత్రం హైదరాబాదుకు వచ్చే అవకాశం ఉంది. బీమా లేకపోవడంతో విక్రంరెడ్డి కుటుంబ సభ్యులు ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. అయితే సౌమ్యారెడ్డికి మాత్రం బీమా సౌకర్యం ఉంది. దీంతో సౌమ్య మృతదేహాన్ని భారత్ కు తరలించే బాధ్యతను బీమా సంస్థ తీసుకుంది.
మృతదేహాల మెడికల్ దర్యాప్తు పూర్తయింది. విక్రంరెడ్డి మృతదేహాన్ని ఇక్కడికి పంపే బాధ్యతను ఆయన సమీప బంధువు వైకుంఠ్ ముత్యాల తీసుకున్నారు. విక్రం రెడ్డి కుటుంబ సభ్యులు డబ్బును డిపాజిట్ చేసిన విషయాన్ని తాము అమెరికాలోని భారత కౌన్సల్ జనరల్ కు తెలియజేసినట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి బి. బాలభాస్కర్ చెప్పారు.












Click it and Unblock the Notifications