గవర్నర్ తో విపక్ష నేతల భేటీ
హైదరాబాద్: శాసనసభ స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం పలువురు విపక్ష నేతలు గవర్నర్ ఎన్.డి. తివారీకి వినతిపత్రం సమర్పించారు. రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లి వారు గవర్నర్‌ను కలిశారు. టీడీపీ తరపున పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సీనియర్ నేతలు నాగం జనార్థనరెడ్డి, చెన్నమనేని రాజేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరపున హరీష్‌రావు, సీపీఐ, సీపీఎం నేతలు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.
స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభను అర్థాంతరంగా వాయిదా వేశారని వారు విమర్శించారు. స్పీకర్ ప్రభుత్వ కనుసన్నలో వ్యవహరిస్తున్నారని, తమకు అన్యాయం చేస్తున్నారని వారు చెప్పారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం కూడా విపక్షాలు కలిసికట్టుగా ఆందోళనలు చేశాయి.












Click it and Unblock the Notifications