శ్రీవారి ఆనందనిలయం స్వర్ణమయం
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆనంద నిలయాన్ని పూర్తిగా స్వర్ణమయం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో శ్రీవారి గర్భగుడి వెలుపలి ప్రాంతమంతా స్వర్ణమయం అవుతుంది. చైర్మన్ ఆదికేశవులునాయుడు అధ్యక్షతన టిటిడి పాలక మండలి సమావేశం శనివారం జరిగింది. తిరుమలలో పెళ్లి చేసుకునే నూతన దంపతులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఉచిత సెల్లార్ దర్శనం కల్పించాలని టిటిడి నిర్ణయించింది.
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 12 మంది తాళ్లపాక అన్నమాచార్య వంశస్థులకు నెలకు ఐదేసి రూపాయల పారితోషికం ఇవ్వాలని కూడా టిటిడి నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని స్విమ్స్ కు వెంటలేటర్, డయాలసిస్ పరికరాలను 2 కోట్ల రూపాయలతో అందించాలని నిర్ణయించింది. తమిళనాడులో వర్షాల కోసం వచ్చే నెల 12 నుంచి 14వ తేదీ వరకు చెన్నైలో సుభిక్షా యాగం చేయాలని కూడా టిటిడి నిర్ణయించింది.












Click it and Unblock the Notifications